ఆహ్వానం

మా గురించి

ఇది తెలుగు జాతి, ఇది తెలుగు భాష, ఇది తెలుగు వేదిక తెలుగు భాష కొక సహజ శక్తివుంది. అందుకనే కర్ణాటక చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తన సామ్రాజ్యమునందు, తెలుగు భాషను రాజ భాష చేసెను కర్ణాటక ఆంధ్ర సార్వభౌముడనిపించుకొని "దేశ భాష లందు తెలుగు లెస్స " అని చాటి చెప్పిన మహానియుడు.

ఈరోజు మన అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది,ఒక చోట చేర్చింది తెలుగు విజ్ఞాన సమితి.

అటువంటి మన భాషా సంస్కృతుల పరిరక్షణ కొరకు,1952వ సం||రంలో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం లో నాడు నివసించిన ,మహనీయులు కీ||శే|| తేన్నేటి విశ్వనాధం గారు ,దివాన్ న్యాపతి మాధవ్ రావు పంతులు గారు ,సూరిభగవంతం గారు , పి.సాంబయ్య గారు ,సి.అన్న రావు గారు మొదలైన ప్రముఖులు తెలుగు విజ్ఞాన సమితి స్థాపించారు.

ప్రస్తుతం సమితి తిరుమల విధ్యానికేతన్ అనే ఉన్నత పాఠశాలను,శ్రీ తెన్నేటి విశ్వనాధం స్మారక గ్రంథాలయాన్ని స్థాపించి నిర్వహిస్తోంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించటానికి శ్రీ కృష్ణదేవరాయ కళమందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది నిర్వహిస్తోంది.

సమితి ప్రతి సంవత్సరము స్వతంత్ర దినోత్సవము,గణతంత్ర దినోత్సవములతో పాటు కర్ణాటకాంద్ర అవతరణ ఉత్స్తవం ఆచరిస్తోంది. ఆ సందర్భంలో కర్ణాటకాంద్ర సార్వభౌముడు శ్రీ కృష్ణదేవరాయల పేరు మీద ,నాటక రత్న శ్రీ గుబ్బి వీర అన్న గారి స్మారకంగా తెలుగు ,కన్నడ కళాకారులను సాహిత్య వేత్తలను సత్కరించి బహుమతీ ప్రదానం చేస్తోంది.

సాహిత్య కళారంగాలలో ఆరితేరిన మహనీయులనెందరినో సమితి గత అరవై సంవత్సరాలలో సన్మానించి గౌరవిస్తుంది. బెంగుళూరు నగరంలో అనేక చోట్ల సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యాలు, సంభవించినప్పుడు, బెంగుళూరు నగరంలోని తెలుగువారి సహాయ సహకారాలతో, డబ్బు, దుస్తులు, మందులు వరదబాధితులకు అందచేయటం జరిగింది. ఈ విధంగా సమితి, బాషా, సాంస్కృతిక పరంగానే కాకుండా సంఘ సేవను కూడా తన కర్తవ్యంగా భావించి నిర్వహిస్తుంది.

నాటి నుండి నేటి వరకు సమితి యొక్క పురోభివృద్ధికి పాటుపడిన వారందరు,ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

జై తెలుగు తల్లి, జై కర్ణాటక, జై హింద్.

వ్యవస్థాపక సభ్యులు

అభినందనలు

ఆర్కైవ్స్




వీడియోలు



కళా వేదిక

మమ్మల్ని సంప్రదించండి

మా కార్యాలయం

Address: 29, Gayathri Devi Park Extension, Kodandarampura, Malleshwara, Bengaluru, Karnataka 560003

మాకు కాల్ చేయండి

+91 8023317850

మాకు ఇమెయిల్ చేయండి